
తాజా వార్తలు
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రమేశ్ స్పందించారు. ‘పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. సుదీర్ఘ వాదనల తరువాత జులై 15, 2019న నా పౌరసత్వం రద్దును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా, హేతుబద్ధంగా, నైతిక విలువలను, వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిగణస్తూ (సెక్షన్10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదంటూ హైకోర్టు 25 పేజీల సుదీర్ఘ తీర్పులో పేర్కొంది. హోంశాఖ వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒక వేళ (సెక్షన్ 10.3) పరిగణించకుండా ఏ నిర్ణయం వచ్చినా, న్యాయం కోసం మళ్లీ మావద్దకు రావొచ్చని హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకే అక్టోబరు 31న దిల్లీలో మరోసారి వాదనలు జరిగాయి. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. న్యాయం జరుగుతుందని నమ్మకముంది’’ అని చెన్నమనేని తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
