close

తాజా వార్తలు

శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ముప్పు లేదు:మంత్రి అనిల్‌

కర్నూలు: శ్రీశైలం డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. డ్యాం భద్రతపై వాటర్‌మ్యాన్‌, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. డ్యాం భద్రతకు సంబంధించిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని.. దాని నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.  ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డ్యాంకు ఎలాంటి పగుళ్లూ లేవని.. ఎప్పటికప్పుడు గ్యాలరీ ద్వారా ఇంజినీరింగ్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాదిలోనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ సంస్థతో అండర్‌ వాటర్‌ వీడియో గ్రఫీ తీయించామన్నారు. విశాఖకు చెందిన ఎన్‌ఐవో సంస్థతో బ్యాతిమెట్రిక్‌ సర్వే చేయించామని.. నివేదిక వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. 

డ్యాం సురక్షితం: శ్రీశైలం ఎస్‌ఈ

శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని డ్యామ్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ) చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాజేంద్రసింగ్‌ చెప్పినట్లు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. జలాశయం సురక్షితంగా ఉందని ఇప్పటికే సీడబ్ల్యూసీ నిర్ధరించిన విషయాన్ని ఎస్‌ఈ గుర్తు చేశారు. ప్లంజ్‌ పూల్‌ సర్వే నివేదికలు రాగానే.. డ్యామ్‌ సేప్టీ కమిటీ ముందు పెడతామన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.