
తాజా వార్తలు
తెగిన ఓహెచ్ఈ తీగ
కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్ వెళ్లే కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 9.40 గంటలకు కేసముద్రం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపిస్తుండగా ఇంజిన్‌పై యాంటెనా, ఓహెచ్ఈ తీగకు అనుసంధానంగా ఉన్న జంపర్ తెగిపోయి రైలు బోగీకి తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు, పొగలు బోగీలోకి కమ్ముకోవడంతో ప్రయాణికులు భయపడ్డారు. కదులుతున్న రైలు నుంచి కొందరు ప్రయాణికులు దూకేందుకు ప్రయత్నం చేయగా అప్రమత్తమైన యువకులు వారిని అడ్డుకొని చైౖన్ లాగారు. నిలిచిన రైలు నుంచి ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టారు. ప్రాణాపాయం లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఖాజీపేట జంక్షన్ నుంచి డీజిల్ ఇంజిన్‌ను రప్పించి కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తగిలించడంతో రాత్రి 1.15 గంటలకు రైలు కదిలింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
