close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌, బంగ్లా గులాబి టెస్టు పోరు ఆరంభమైంది. ఈ చారిత్రక టెస్టులో బంగ్లాదేశ్‌ సారథి మొమినల్‌ హఖ్‌ టాస్‌ గెలిచాడు. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వికెట్‌ గట్టిగా, పొడిగా ఉండటంతో బ్యాటింగ్‌ ఎంచుకున్నట్టు అతడు తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ‘ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో కలవం’

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా సంకేతాలు వెలువడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నుంచి మళ్లీ ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. ఇకపై బేరసారాలకు తావులేదన్నారు. భాజపాతో జట్టుకట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇంద్రుడి సింహాసనాన్ని ఇస్తామన్నా భాజపాతో కలిసేది లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బుగ్గన వ్యాఖ్యలు విడ్డూరం: ఆలపాటి రాజా

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం తెదేపా ప్రాధాన్యత కాదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా అన్నారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌ పాలనకు అద్దం పడుతున్నాయన్నారు. ఆర్థిక మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడితే.. రాష్ట్ర భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు విచారణ వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ, ఈడీ కోర్టుల్లో నడుస్తున్న కేసు విచారణ వాయిదా పడింది. విచారణకు హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. సీఎం జగన్‌ న్యాయస్థానాన్ని కోరారు. అంగీకరించిన  కోర్టు విచారణను డిసెంబర్‌ 6కి వాయిదా వేసింది. 

5. హెడ్‌కానిస్టేబుల్‌పై యువకుల దాడి

ఓ పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌పై ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. నగర పరిధిలోని స్పెషల్‌ బ్రాంచ్‌లో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ముగ్గురు యువకులు అతడిని వెనక నుంచి ఢీ కొట్టారు. దీంతో నాగేశ్వరరావు కిందపడిపోయారు. వెంటనే ఆ ముగ్గురూ అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ అలజడి

హైదరాబాద్‌ నగర శివారులోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరు గ్రామంలో చెడ్డీగ్యాంగ్‌ అలజడి సృష్టించింది. రెండు ఇండ్లలో చోరీకి పాల్పడింది. మొత్తం 20 తులాల బంగారం. రూ.75 వేల నగదు దోపిడీ చేసింది. వృద్ధురాలి చెవి దుద్దులను దుండగులు బలవంతంగా లాగేశారు. దీంతో ఆమె చెవులకి గాయాలయ్యాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఇంట్లో కి చొరబడిన చెడ్డీ గ్యాంగ్ 2 గంటల వరకు అక్కడే ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీ రాజం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్య, ఆమె సోదరుడు, సోదరి.. ఇలా మొత్తం ఐదుగురిపై చమురు పోసి నిప్పంటించాడు. బాధితులను తొలుత సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కష్టం’

దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నమోదవుతున్న వృద్ధిరేటుతో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏడాదికి తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు కావాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌పై అమెరికా ప్రశంసలు

అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి భారత్‌ అందిస్తున్న సహకారాన్ని అమెరికా స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని అనుకుంటున్న వేళ.. భారత్‌ తన సాయాన్ని కొనసాగించడాన్ని ప్రశంసించారు. 2001లో తాలిబన్లపై అమెరికా పోరాటానికి దిగిన నాటి నుంచి భారత్‌ మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందజేసిందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. హెచ్‌ఐసీసీలో ఇండియాజాయ్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.