close

తాజా వార్తలు

ఏపీ రాజధానితో కొత్త మ్యాప్‌ విడుదల

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మ్యాప్‌లో రాజధానిని గుర్తించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అమరావతిని గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ను విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిని మార్క్‌ చేస్తూ సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఈ మ్యాప్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.