close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ఏపీ రాజధానితో కొత్త మ్యాప్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మ్యాప్‌లో రాజధానిని గుర్తించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అమరావతిని గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ను విడుదల చేయాలంటూ ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చనిపోయేదాకా కాంగ్రెస్‌ను వీడను: వీహెచ్‌

చనిపోయేదాకా కాంగ్రెస్‌ పార్టీని వీడనని, పార్టీకి విధేయుడిగానే ఉంటానని సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇందిరాగాంధీ 1972లో బలహీనవర్గాలకు న్యాయం అనే నినాదం తీసుకున్నారు. భూములు పంచడం, బ్యాంకులను జాతీయం చేయడం.. రుణాలివ్వడం జరిగింది. బలహీనవర్గాల అనుకూల నినాదాలతో కాంగ్రెస్‌ ఇప్పటి వరకు బతికింది’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపాతో ఎవరూ టచ్‌లో లేరు:రఘురామ

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ గుర్తు పట్టి పలకరిస్తేనే ఆయన దగ్గరకు వెళ్లానని.. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. భాజపా ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. వైకాపా ఎంపీలు ఎవరూ భాజపాతో టచ్‌లో లేరని వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలపై ఎంపీలు.. కేంద్రమంత్రులను కలుస్తుంటారని.. దీనిలో రాజకీయ కోణం ఏమీ ఉండదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 18నుంచి తెదేపా సంస్థాగత ఎన్నికలు:చంద్రబాబు

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ నిర్దేశకులని, వాళ్ల అభీష్టం మేరకే పదవులు ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తన నివాసంలో పార్టీ నాయకులతో భేటీ అయిన చంద్రబాబు.. పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 18 నుంచి తెదేపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.  పార్టీ ఎన్నికల పురోగతిని సమీక్షించిన చంద్రబాబు.. గ్రామ, మండల పార్టీ కమిటీల ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే!

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ముంబయిలోని నెహ్రూ సెంటర్‌లో జరుగుతున్న సమావేశం ముగిసింది. ఈ చర్చలు ఫలవంతంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించేలా అంగీకారం కుదిరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం వెలువడనుంది. ఉద్ధవ్‌ ఠాక్రే కూటమికి నేతృత్వం వహించేలా, ఐదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగేలా ఈ కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైల్వేను ప్రైవేటీకరించడం లేదు: గోయల్‌

భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడానికి కేవలం కమర్షియల్‌, ఆన్‌బోర్డ్ సేవలను మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వాట్సప్‌ సెట్టింగ్స్‌ మార్చుకోండి: ఆర్మీ

భారత్‌కు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సత్వరమే తమ ఫోన్‌లో వాట్సప్‌ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలని సూచించింది. భారత్‌కు చెందిన ఓ ఆర్మీ జవానును పాక్‌ చెందిన ఓ అనుమానిత ఫోన్‌ నంబర్‌ ద్వారా వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చినట్లు ఆర్మీ పేర్కొంది. అయితే, వెంటనే సదరు ఆర్మీ జవాను అప్రమత్తమై ఆ గ్రూప్‌ నుంచి వైదొలిగి ఆ గ్రూప్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐటీ దాడులు జరగలేదు: నాగార్జున

తన కార్యాలయంపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారా? అంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘ఐటీ దాడులు జరిగాయా? అంటూ నా స్నేహితుల్లో కొందరు ఫోన్లు చేశారు. ఇప్పుడు ఇది నాకు వార్త (ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ). నాపై, నా కార్యాలయంపై అలాంటి దాడులు ఏమీ జరగలేదు’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘OMG Daddy’ అంటున్న అల్లు అర్జున్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.