close

తాజా వార్తలు

ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్ల వద్ద హైసెక్యూరిటీ

ముంబయి: మహారాష్ట్ర రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను భాజపా వలకు చిక్కకుండా హోటళ్లకు తరలించాయి. వారు ఉన్న మూడు వేర్వేరు హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు.

భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం, ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో త్వరలో బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను జుహు ఏరియాలో ఉన్న జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌కు తరలించింది. ఎన్సీపీ ఎమ్మెల్యేలను పోవాయ్‌ ప్రాంతంలోని రెనాసెన్స్‌ హోటల్‌కు తరలించగా.. శివసేన ఎమ్మెల్యేలను అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని లలిత్‌ హోటల్‌కు తరలించారు.

శివసేన ఎమ్మెల్యేలు ఉన్న లలిత్‌ హోటల్‌ వద్ద రెండు పోలీస్‌స్టేషన్లకు చెందిన సిబ్బంది కాపలా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. మిగిలిన రెండు హోటళ్ల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు. హోటళ్ల ప్రైవేటు సెక్యూరిటీ కూడా తనిఖీ లేకుండా ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే రెనాసెన్స్‌ హోటల్‌కు చేరుకున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.