close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పోటీ నుంచి తప్పుకున్న కమలా హారిస్‌

2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె మంగళవారంతో ముగించారు. ‘‘నా మద్దతుదారులకు ఇది చాలా విచారకరం. ఈ రోజు నేను నా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాను. కానీ మీతో ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను’’ అని కమలా హ్యారిస్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. జీతాలు తగ్గవు!

ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైంది. ఆదివారంలోపే ఈ నివేదికను ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి అందజేయనుంది. ప్రభుత్వంలో విలీనం తర్వాత జీతాలు తగ్గుతాయని, కొన్ని సదుపాయాలు కోల్పోయే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన ఉంది. అయితే జీతాలు తగ్గవని కీలక అధికారులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రైల్వే అప్రెంటిస్‌షిప్‌లో తెలుగువారికి అన్యాయం

రైల్వే సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తే ఉద్యోగం సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయి. రైల్వేశాఖ చేపట్టే గ్రూప్‌-డి నియామకాల్లో 20 శాతం పోస్టులు ఇక్కడ అప్రెంటిస్‌షిప్‌ చేసిన వారికి లభిస్తాయి. ఇంత కీలకమైన అప్రెంటిస్‌షిప్‌ల ఎంపికలో ద.మ.రైల్వే అధికారులు అనుసరిస్తున్న విధానం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తోంది. ఇతర రైల్వే జోన్లు స్థానికుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంటే.. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న ద.మ.రైల్వే మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తోందని అభ్యర్థులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 5 మార్గాల ఆలోచన

పోలవరం నుంచి గోదావరి వరద జలాలను కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్‌తో అనుసంధానించేందుకు వ్యాప్కోస్‌ సంస్థ అయిదు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద జలాలను బనకచర్ల రెగ్యులేటర్‌ వద్దకు చేర్చి... అటు రాయలసీమ జిల్లాలకు, ఇటు పెన్నాకు తరలించేలా వీలుగా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొత్త సీఎస్‌ ఎవరో!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శైలేంద్రకుమార్‌ జోషి ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. కొత్త సీఎస్‌ ఎవరనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. రాష్ట్ర అధికార యంత్రాంగంలో అత్యున్నతమైన ఈ పదవికి పలువురు ఐఏఎస్‌లు పోటీ పడుతున్నారు. 2018 ఫిబ్రవరి నుంచి జోషి సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సర్వీసు పొడిగించే అవకాశం ఉన్నా జోషి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. 50 వైద్య సీట్ల పెంపు

మంగళగిరి ఎయిమ్స్‌లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి అదనంగా 50 సీట్లు పెరగనున్నాయి. 2018-19లో 50 సీట్లతో తరగతులు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో జరుగుతోన్న నిర్మాణాల్లో వైద్య సేవలు, విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో తరగతులను ఎయిమ్స్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి అదనంగా మరో 50 సీట్లు పెరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త్వరలో అధికారిక ప్రకటన జారీ చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. చనిపోయిన 17 మందీ సాధారణ గ్రామస్థులే

మావోయిస్టుల ఏరివేతలో భాగంగా 17 మందిని మట్టుబెట్టినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఏడేళ్ల క్రితం చేసిన ప్రకటన బూటకమని తేలిపోయింది. 2012 జూన్‌ 28న బీజాపుర్‌ జిల్లాలోని సర్కేగుడ వద్ద కాల్పుల్లో చనిపోయిన వీరంతా సాధారణ గ్రామస్థులే అని జస్టిస్‌ విజయ్‌కుమార్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిటీ తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మే 5 లేదా 6 నుంచి ఎంసెట్‌!

తెలంగాణ ఎంసెట్‌ను మే నెల 5 లేదా 6వ తేదీ నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. మే నెల 3వ తేదీన నీట్‌ జరగనుంది. ఆ పరీక్షకు, ఎంసెట్‌కు ఒకట్రెండు రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్న విద్యామండలి 5 లేదా 6న ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది.

9. నల్గొండ కుర్రాడికి రూ.కోటిన్నర వార్షిక వేతనం

నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు చింతరెడ్డి సాయిచరిత్‌రెడ్డికి రూ.కోటిన్నర వార్షిక భారీ వేతనం లభించింది. బాంబే ఐఐటీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న సాయిచరిత్‌రెడ్డికి ప్రాంగణ ఎంపికల్లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూ.1.54 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసింది. ప్రతిష్ఠాత్మక బాంబే ఐఐటీ నుంచి ఈ ఆఫర్‌ సాధించిన ముగ్గురిలో సాయిచరిత్‌రెడ్డి ఒక్కరే తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు కావటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఐసీసీ.. కాచుకో!

పాలన మొత్తం సుప్రీం కోర్టు నియమిత కమిటీ చేతుల్లోకి వెళ్లి బీసీసీఐ బలహీన పడ్డ సమయంలో ఐసీసీ.. భారత్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. భారత బోర్డు ఆదాయంలోనూ కోత విధించింది. అయినా ఐసీసీని నిలదీసే వారు లేకపోయారు. కానీ ఇప్పుడు బీసీసీఐ నడిపిస్తున్న సౌరభ్‌ గంగూలీ ఐసీసీతో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు. బీసీసీఐ ఆదాయంలో రూ.165 కోట్ల దాకా కోత పెట్టిన ఐసీసీపై న్యాయ పోరాటం చేయాలని గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.