close

తాజా వార్తలు

కన్న కొడుకుని కడతేర్చిన తండ్రి

మద్యానికి బానిసైన కుమారుడితో విసిగి హత్య


రక్తపు మడుగులో రాహుల్‌

బల్లార్ష, న్యూస్‌టుడే : మద్యానికి బానిసైన కుమారుడి చేష్టలు సహించలేని ఓ తండ్రి సుత్తితో తలపై మోది కొడుకును చంపిన ఘటన బల్లార్‌పూర్‌ పట్టణంలోని విద్యానగర్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. బల్లార్‌పూర్‌ పట్టణంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న కాగితపు మిల్లు విశ్రాంత ఉద్యోగి సోపన్‌ నగరాడే(72) దంపతులకు ఒక్కడే కుమారుడు రాహుల్‌(42). రాహుల్‌కు భార్యా, కుమార్తె ఉన్నారు. వీరందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. రాహుల్‌ కాగితపు మిల్లులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తుండగా.. అతని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. మద్యానికి బానిసైన రాహుల్‌ మూడు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. దీంతో తరచూ తండ్రి - కొడుకులకు మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. రాహుల్‌ తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ఆయనకు తెలియకుండా రూ.3 లక్షలు తీసి జల్సా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి అతడిని నిలదీశాడు. దీంతో మూడు రోజుల నుంచి వివాదం మరింత పెరిగింది. శనివారం తండ్రి, కొడుకుల మధ్య మాటామాటా పెరిగింది. తండ్రి రాహుల్‌ను పక్కనే ఉన్న సుత్తితో తలపై మోదాడు. ఘటనాస్థలంలోనే అతడు మృతి చెందాడు. వెంటనే తండ్రి సోపన్‌ బల్లార్‌పూర్‌ పోలీసు స్టేషన్‌కు విషయాన్ని చెప్పి లొంగిపోయాడు. ఇంటికి వెళ్లి చూసే సరికి పోలీసులకు రక్తపుమడుగులో మృతి చెందిన రాహుల్‌ కనిపించాడు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఠాణేదార్‌ భగత్‌ తెలిపారు. భార్య, రాహుల్‌ కుమార్తె రోదించడం అక్కడి వారిని కలచివేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.