
తాజా వార్తలు
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దేశంలోని మైనార్టీలను ఎలా చూసుకోవాలో మేం చూపిస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కశ్మీర్ అంశంపై ఆయన మరోసారి మాట్లాడారు. మూక హత్యలపై బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా చేసి వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. నసీరుద్దిన్ పాక్‌కు వెళ్లిపోవాలంటూ భాజపా నేతలు డిమాండ్‌చేశారు. ఈ పరిణామాలన్నింటిపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.
‘మైనార్టీల సంక్షేమం విషయంలో పాక్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. మత వివక్షకు తావులేకుండా చూసుకుంటోంది. పాక్‌లో ఉన్న మైనార్టీల రక్షణ విషయంలో రాజీ పడబోం. దేశాభివృద్ధికి మైనార్టీలు కూడా ఎంతో దోహదపడుతున్నారు. వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. వాళ్లను ఎలా స్వీకరించాలో, ఎలా మసలుకోవాలో మోదీ ప్రభుత్వానికి మేం చూపిస్తాం. భారత్‌లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోతోందని అక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నారు. భారతీయ పౌరులతోపాటు తమను సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం అలా కాకుండా మైనార్టీ సంక్షేమం విషయంలో ఆదర్శంగా ఉండాలనుకుంటోంది’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
