close

తాజా వార్తలు

ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

దిల్లీ: ఈబీసీల రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లపై గెజిట్‌ విడుదలైంది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇటీవల లోక్‌సభ, రాజ్యసభ 2/3వంతు మెజార్టీతో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. ఇవాళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మార్గం సుగమమైంది.

రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయంటే..

ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ప్రతిపాదిత ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే..

* వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు...

* అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు...

* నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు..

* నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు రిజర్వేషన్‌ పొందేందుకు అర్హులు.

* విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి.

* ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.