close

తాజా వార్తలు

చదువుకున్న బడికి చేయూత

చదువుకున్న బడికి చేయూత

మార్కోండపుట్టి (కొమరాడ), న్యూస్‌టుడే : ప్రపంచంతో పోటీ పడుతున్న రోజులివని, విద్యారంగమంతా కంప్యూటర్‌ పరిజ్ఞానంతో నడుస్తుందని శ్రీకాకుళం నగరపాలక కమిషనరు రెడ్డి శ్రీరాములనాయుడు అన్నారు. సోమవారం మార్కోంపుట్టి జడ్పీ ఉన్నత పాఠశాలకు రెండు కంప్యూటర్లు, గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలు, భద్రపరుచుకునే ట్రేకులు, జిమ్‌ పరికరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గరుగుబిల్లి మండలం పాత మార్కోండపుట్టి గ్రామంలో విద్యను అభ్యసించానన్నారు. ఆ సమయంలో పాఠశాలలో అరకొర సదుపాయాలే ఉండేవన్నారు.  కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సర్కారు పాఠశాలలో సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. అయితే ప్రభుత్వం చేస్తుందని చూడకుండా, మన విద్యాలయానికి మనం ఆసరాగా ఉండాలన్నారు. పాఠశాలకు అవసరమైన సామగ్రిని ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీˆటీసీˆ సభ్యులు గొట్టాపు త్రినాధం, గ్రామ పెద్దలు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.