close

తాజా వార్తలు

ఇదీ మ‌న రాజ్యాంగం!

ఇవాళ గ‌ణ‌తంత్ర దినోత్సవం..
అంటే రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన రోజు...
అందుకే మ‌న‌మంతా దీన్ని వేడుక‌లా చేసుకుంటాం...
మ‌రి రాజ్యాంగం గురించి ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు బోలెడు...
అవేంటో ట‌క‌ట‌కా చ‌దివేద్దామా!

రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ?
1950 జనవరి 26వ తేదీ నుంచి.
రాసేందుకు పట్టిన కాలం?
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
ప్రత్యేకతేంటి?
అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత దేశానిదే.
ఎలా రాశారు?
రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రాయ్‌జాదా.. ఇటాలిక్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ మరి కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
ఎలా ఉంటుంది?
‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలుగా ఉంది.

మూలప్రతులు ఎక్కడున్నాయి?
దిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో వీటిని చూడొచ్చు. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు.

ఎంత ఖర్చయ్యింది?
దీన్ని రూపొందించడానికి సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
రూపొందించింది ఎవరు?
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి డా. బీఆర్‌ అంబేడ్కర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో ప్రధాన కమిటీతోపాటు, కొన్ని ఉప కమిటీలు ఏర్పడ్డాయి.
మనలాంటి పిల్లలకు రాజ్యాంగంలో ఉన్న హక్కులేంటి?
* ఆరు నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలంతా ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువుకోవచ్చు.
* ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు.
* అసాంఘిక కార్యకలాపాలకు పిల్లల్ని ఉపయోగించేవారు నేరస్థుల కింద లెక్క.
* 14ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. ఆడుకోవడం, వినోదించడం, అభిరుచుల్ని పాటించడానికి మనకు ఇందులో హక్కులున్నాయి.
ఏఏ రాజ్యాంగాల్ని పరిశీలించారు?
మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్‌ ఆఫ్‌ బారోయింగ్స్‌’ అని సరదాగా అంటారు. ఎందుకో తెలుసా? జపాన్‌, ఐర్లాండ్‌ ఇంగ్లండ్‌, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని కొన్ని అంశాల్ని తీసుకున్నాం కాబట్టి. రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది. ఈ తేదీనే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటాం.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.