
తాజా వార్తలు
దిల్లీ: నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా విమర్శలు గుప్పించారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున ఇస్తానన్న సొమ్ము రోజుకు రూ.17 వస్తుందన్నారు. ఈ చర్య రైతులను అవమానించడమేనని విమర్శించారు. ఈవీఎంలపై సందేహాలున్నాయని, ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం అధికారులను కలిసి అభిప్రాయాలు చెబుతామని తెలిపారు. ఈవీఎంలకు సంబంధించిన డాక్యుమెంట్‌ను కూడా ఎన్నికల సంఘానికి అందజేస్తామన్నారు. ఈవీఎంలపై రాజకీయ పక్షాలతో పాటు ప్రజలకు కూడా అనేక అనుమానాలున్నాయని వివరించారు.
భవిష్యత్ కార్యాచరణపై దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘సేవ్ ది నేషన్-సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఎన్డీయేతర పక్షాలు శుక్రవారం సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, డెరాక్ ఒబ్రెయిన్, కనిమొళి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఆంటోని, అహ్మద్ పటేల్, రాంగోపాల్ యాదవ్, కోదండరామ్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. ఎన్టీయే పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.30వేల కోట్లు అనిల్ అంబానీకి నేరుగా లబ్ధి చేకూర్చారన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- ప్రాణం తీసిన పానీ పూరి
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- పశువులంటే నాకు ప్రాణం
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
