
తాజా వార్తలు
చదువంటే ఇష్టం ఉన్నా... పదో తరగతితో ఆపేసిందామె. తనలా మరెవరూ కాకూడదని బడి మానేసిన వారిని చదువుల బాట పట్టిస్తోంది. ఆ ప్రయత్నాన్ని గుర్తించిన ఓ సంస్థ ఆమెను రెండు పాఠశాలలకు ఇన్‌ఛార్జ్‌గా చేసింది. ఆమే పాతికేళ్ల తులసీబాయి.
* తులసీబాయిది ఏ ఊరు?
బెంగళూరు శివారులోని ఎన్.వై.హోస్కోటె.
* ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?
తులసిది పేద కుటుంబం. చదువుకోవాలని ఉన్నా, తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. అలా వెళ్తూనే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకుంది. ఆపై చదువును కొనసాగించలేక పోయింది.
* పిల్లల్ని బడికి పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది?
పనిలోకి వెళ్లాక అక్కడ తనలాంటి పిల్లలు చాలామంది ఉన్నారని తెలుసుకుంది. వాళ్లు మళ్లీ పాఠశాల మెట్లు ఎక్కేలా చేయాలనుకుంది. అప్పుడే ఓ పత్రికలో ‘అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ యాక్షన్ (ఏపీఎస్ఏ)’ సంస్థ ప్రకటన చూసింది. నిరుపేద విద్యార్థుల్ని బడిబాట పట్టించడమే వాళ్ల పని. అలా వాళ్లను సంప్రదించింది.
* ఆ సంస్థ అవకాశం ఇచ్చిందా?
మొదట ఒప్పుకోలేదు. డిగ్రీ ఉండాలన్నారు. కానీ ఆమె పట్టు వదల్లేదు. తన సమస్యని వారికి వివరించింది. తనలా మరొకరు కాకుండా కృషి చేస్తానని చెప్పడంతో అంగీకరించిందా సంస్థ. కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నాక ఆత్మవిశ్వాసంతో పని చేయడానికి సిద్ధమైంది.
* బడి బాట పట్టించడం అంటే...?
హోస్కోటె ప్రాంతంలోని పాఠశాలలకు వెళ్లి రోజూ హాజరుపట్టి పరిశీలించడంతో తులసి పని మొదలవుతుంది. అందులో బడికి రానివారిని గుర్తించి వాళ్లింటికి వెళ్తుంది. ఏదయినా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని ఆసుపత్రికి చేర్చడానికి ఏర్పాటు చేస్తుంది. కూలికి వెళ్తోంటే మాత్రం వారి తల్లిదండ్రులకు చదువు విలువ చెబుతుంది. పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్నం భోజనం వంటి సౌకర్యాలన్నింటినీ అందేలా చేస్తుంది.
* ఫలితం కనిపించిందా?
చాలా మార్పు కనిపించింది. బడి మానేసిన పిల్లల సంఖ్య బాగా తగ్గింది. దాంతో ఆ సంస్థ ఆమెను రెండు పాఠశాలలకు ఇన్ఛార్జిగా చేసింది. వాటిల్లో పిల్లల హాజరు బాధ్యత పూర్తిగా ఆమెకు అప్పజెప్పింది. దాంతో ఇప్పుడక్కడ వందశాతం హాజరు ఉంది. ఏటా మార్చి నుంచి మే వరకు ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని బడిలో చేర్పించమని అడుగుతోంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
