close

తాజా వార్తలు

బిర్యానీ పంచారు.. శత్రుత్వం సమసిసోయింది.. 

చెన్నై: సినిమాల్లోనే కాదు..నిజజీవితంలో కూడా రెండు వర్గాల మధ్య పగ ప్రతీకారాలు ఉంటాయి. సినిమాల్లో అయితే క్లైమాక్స్‌లో ఈ గొడవలు సద్దుమణుగుతాయి. కానీ నిజజీవితంలో మనస్పర్థలు కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ మధ్యలో వాగ్వాదాలు, గొడవలు ఇలా గడిచిపోతాయి. తమిళనాడులోని మదురై జిల్లాలోనూ ఇంతే. రెండు సామాజిక వర్గాల మధ్య దశాబ్దాల క్రితం గొడవలు ఏర్పడ్డాయి. కొన్నాళ్ల పాటు అవి తీవ్రతరం దాల్చాయి. కాల క్రమేణా ఇరు వర్గాల మధ్య మనస్పర్థలు, మాటపట్టింపులు తగ్గాయి. అందరూ కలిసిపోయారు. దానికి గుర్తుగా ఇద్దరూ కలిసి పండగ చేసుకున్నారు. మామూలు పండగ కాదు. అందరూ చెప్పుకునే స్థాయిలో చేశారు.

మదురైలోని వడకంపట్టి గ్రామానికి చెందిన ఎన్‌పీ రామస్వామి అనే వ్యక్తికి చెన్నై, మదురై వ్యాప్తంగా హోటళ్లున్నాయి. వారికి మరో వర్గానికి మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలున్నాయి. అవి తీరిపోతే వారి ఆరాధ్యదైవం మునియండి స్వామికి మొక్కులు తీర్చుకుని, ప్రజలకు అన్నదానం చేస్తానని రామస్వామి మొక్కుకున్నాడు.దీంతో ఎట్టకేలకు గొడవలు తీరాయి. ఆయనే తన సొంత ఖర్చుతో తన బంధువులతో పాటు వడకంపట్టి చుట్టు పక్కల సుమారు 8,000 మందికి అన్నదానం చేశారు. ఇందుకోసం 100 మేకలను, 600 కోడిపుంజులను దేవుడికి బలిచ్చి ఆయన మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మటన్‌ బిర్యానీని ప్రజలకు ప్రసాదంగా పంచిపెట్టారు. జంతు బలి ఇవ్వడం చట్టరీత్యా నేరమయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి చర్యలు ఆగడం లేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.