close

తాజా వార్తలు

జనసేన బహిరంగ సభలో అపశ్రుతి 

తొక్కిసలాటలో యువకుడి మృతి

 

నంద్యాల పాత పట్టణం: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్న బహిరంగ సభలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సిరాజ్‌ (30) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సభకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. సభ కోసం స్పీకర్లకు ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలు జారిపోవడంతో ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిరాజ్‌ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. సిరాజ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.