Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 77027
            [news_title_telugu_html] => 

ఖషోగ్గి పిల్లలపై అంత ప్రేమ ఎందుకు?

[news_title_telugu] => ఖషోగ్గి పిల్లలపై అంత ప్రేమ ఎందుకు? [news_title_english] => Jamal Khashoggi children got blood money from Saudi Government [news_short_description] => వాషింగ్టన్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గికి సంబంధించి రోజులో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఖషోగ్గిని హత్య చేయడానికి కొంతమంది అమెరికాలో శిక్షణ పొందారణి వాషింగ్టన్‌ పోస్టు రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈయన కుటుంబానికి చెందిన మరో ముఖ్యవిషయాన్ని ఆ పత్రిక ప్రచురించింది. [news_tags_keywords] => Jamal Khashoggi,Saudi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-02 23:56:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఖషోగ్గి పిల్లలపై అంత ప్రేమ ఎందుకు? - Jamal Khashoggi children got blood money from Saudi Government - EENADU
close

తాజా వార్తలు

ఖషోగ్గి పిల్లలపై అంత ప్రేమ ఎందుకు?

వాషింగ్టన్‌: వాషింగ్టన్‌పోస్టు కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గికి సంబంధించి రోజులో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఖషోగ్గిని హత్య చేయడానికి కొంతమంది అమెరికాలో శిక్షణ పొందారని వాషింగ్టన్‌ పోస్టు రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈయన కుటుంబానికి చెందిన మరో ముఖ్యవిషయాన్ని ఆ పత్రిక ప్రచురించింది. జమాల్‌ హత్యతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆయన పిల్లలకు సౌదీ అరేబియా ప్రభుత్వం అతి ప్రేమ చూపుతోందని చెప్పుకొచ్చింది.
ఖషోగ్గికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు నివసించడానికి కోట్ల డాలర్ల విలువ చేసే చ ఇళ్లను వారికి ఆ దేశ ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా వారికి ప్రతినెలా 10,000డాలర్ల చొప్పున అందిస్తోందని ఆ పత్రిక పేర్కొంది. దీంతో పాటు అవసరం లేకపోయినప్పటికీ వారికి మిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తోందని ఆ పత్రిక తెలిపింది. ఖషోగ్గి పెద్ద కుమారుడు సాలా అమెరికా నుంచి సౌదీకి మకాం మార్చాడు. అమెరికాలో నివసిస్తున్న మిగతా వారు కూడా అక్కడి నివాసాలను అమ్మేసి సౌదీ బాట పట్టే యత్నంలో ఉన్నారని పత్రిక వెల్లడించింది. అయితే  ఖషోగ్గి లేనప్పుడు ఆయన పిల్లలపై అంత ప్రేమ ఎందుకు చూపుతుందో కారణాలు తెలియరాలేదని ఆ వాషింగ్టన్‌ పోస్ట్ తెలిపింది.
ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈమేరకు టర్కీ పత్రికలు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నాయి. ఈ వార్తలన్నింటినీ ఎప్పటికప్పుడు సౌదీ ఖండిస్తూ వస్తోంది. ఖషోగ్గి హత్యలో యువరాజు ప్రమేయం లేదని, ఇది కొందరి ఏజెంట్ల పని అని చెప్పుకొస్తోంది.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.