
తాజా వార్తలు
ములాయం సింగ్‌ను ఉద్దేశిస్తూ సుష్మా స్వరాజ్ ట్వీట్
రాంపూర్: లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఖండించారు. దీనిపై ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పందించకపోవడాన్నీ ఆమె తప్పుబట్టారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిపై అభ్యంతరం తెలపకపోగా కనీసం స్పందించే ప్రయత్నం కూడా చేయడం లేదంటూ ఆమె ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
‘ములాయం భాయ్..సమాజ్‌వాదీ పార్టీకి మీరు పితామహుడు. రాంపూర్ ద్రౌపదిని(జయప్రదను ఉద్దేశిస్తూ) మీ పార్టీలో ఉన్న వ్యక్తి మీ ముందే అవమానిస్తున్నాడు. మీరు మాత్రం భీష్ముడిలా మౌనంగా ఉండి తప్పు చేయకండి’ అంటూ ట్వీట్ చేసి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, పార్టీ నాయకురాలు జయా బచ్చన్‌ను ట్యాగ్ చేశారు.
అజాం ఖాన్ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆ వ్యక్తి(జయప్రదను ఉద్దేశిస్తూ) వేలుపట్టుకుని నేను రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఇక్కడి వారికి పరిచయం చేశాను. ఆమె జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నాను. కానీ ఆమె నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడు తెలిసింది. జయప్రద ఖాకీ నిక్కర్ వేసుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారమే రేగించింది. అజాంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. దీంతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
