close

తాజా వార్తలు

ఉల్కల వల్ల చంద్రుడిపై నీటి ఆవిరి..

వాషింగ్టన్‌ (అమెరికా): చంద్రుడిపై భవిష్యత్తులో చేసే పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడేలా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ విషయాన్ని కనుగొంది. ఉల్కాపాతం కారణంగా చంద్రుడి ఉపరితలంపైకి ఆవిరి రూపంలో నీళ్లు వచ్చినట్లు గుర్తించింది. నాసాకు చెందిన రోబోటిక్‌ మిషన్‌.. లూనార్‌ అట్మాస్పియర్‌ అండ్‌ డస్ట్‌ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ఫ్లోరర్‌ (ఎల్‌ఏడీఈఈ) ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. చంద్రుడిపై ఉన్న వాతావరణంలో నీరు (హెచ్‌2ఓ), హైడ్రోక్సిల్‌ (ఓహెచ్)‌ ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. అయితే, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న మూలాల గురించి చర్చ కొనసాగుతోంది. 

చంద్రుడిపై ఉన్న వాతావరణంలో చాలా సమయాల్లో హెచ్‌2ఓ, ఓహెచ్‌ పెద్ద మొత్తంలో ఉండదని శాస్త్రవేత్త రిచర్డ్‌ ఎల్ఫిక్‌ తెలిపారు. అయితే, చంద్రుడికి ఓ ఉల్క దగ్గరగా వచ్చిన సమయంలో.. చంద్రుడి నుంచి నీటి ఆవిరి బయటకు వచ్చినట్లు తాము గుర్తించినట్లు ఆయన చెప్పారు. మళ్లీ ఆ ఉల్క చంద్రుడికి దూరంగా వెళ్లిన సమయంలో హెచ్‌2ఓ, ఓహెచ్‌ మళ్లీ తగ్గిపోయినట్లు తెలిపారు. చంద్రుడి ఉపరితలాన్ని ఉల్క ఢీ కొట్టిన సమయంలో నీళ్లు వచ్చినట్లు తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ఉల్క ఎనిమిది సెంటీమీటర్లు చొచ్చుకెళ్లినప్పుడు ఈ నీళ్లు బయటకు వచ్చినట్లు చెప్పారు. చంద్రుడిలో ఈ నీరు మంచు రూపంలో ఉన్నట్లు తెలిపారు.  
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.