close

తాజా వార్తలు

ఆలయంలో తొక్కిసలాట: ఏడుగురి మృతి

తిరుచ్చి: తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్‌ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న  కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మృత్యవాత పడ్డారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. చైత్రమాస ఉత్సవంలో భాగంగా హుండీలోని చిల్లరను భక్తులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో నాణేల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడమే ఈ తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. మృతులు కరూర్‌, కడలూరు, సేలం, నమక్కల్‌, విల్లుపురం జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ఆలయంలో ఏటా ఘనంగా జరిగే ఉత్సవం కావడంతో ఆదివారం నాడు భక్తులు పోటెత్తారు.
 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.