close

తాజా వార్తలు

విచారణ కమిటీ నుంచి తప్పుకొన్న జస్టిస్‌ రమణ

దిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై వచ్చిన  లైంగిక ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన జస్టిస్‌ ఎన్వీ రమణ, మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా జెనర్జీతో కూడిన త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ నుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ తప్పుకొన్నట్లు సమాచారం. ఇందుకు వివరణగా నాలుగు పేజీల లేఖను రాసి ఆయనే స్వయంగా ఈ కమిటీ నుంచి తప్పుకొన్నారని సుప్రీం సన్నిహిత వర్గాలు గురువారం మీడియాకు తెలిపాయి.
మరోవైపు సీజేఐను బలవంతంగా తప్పించే కుట్ర జరుగుతుతోందని న్యాయవాది ఉత్సవ్‌ బెయిన్స్‌ వేసిన అఫిడవిట్‌పై సుప్రీం గురువారం వాదనలు వింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌  ఏకే పట్నాయక్‌ను నియమించింది. ఇంటెలిజన్స్‌ బ్యూరో, సీబీఐ, దిల్లీ పోలీసులు ఈ విచారణలో పట్నాయక్‌కు సహకారం అందిచాలని సుప్రీం ఆదేశించింది.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.