
తాజా వార్తలు
చండీగఢ్: మహిళలకు పెద్దపీట వేయాలన్న మాటలు కాగితాలు, నినాదాలకే పరిమితమవుతున్నాయి. చట్టసభల్లో వారికి 33శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. చివరికి మెరుగైన అక్షరాస్యత గల రాష్ట్రాల్లో ఒకటైన హరియాణాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ట్రం ఏర్పడి 53ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేవలం ఐదుగురు మహిళలను మాత్రమే ఎంపీలుగా చట్టసభలకు పంపగలిగారు. అయితే ఈసారి మాత్రం 12మంది మహిళామణులు రంగంలోకి దిగుతుండడమేగాక.. అందులో 11 మంది స్వతంత్రులు కావడం విశేషం.
1997లో జనతా పార్టీ తరఫున గెలుపొందిన చంద్రావతి హరియాణా నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. ప్రముఖ నేత చౌదరి బన్సీలాల్‌పై ఆమె గెలుపొందడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆమె 1990లో పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేశారు. అలాగే కాంగ్రెస్ నేత కుమారి సెల్జా మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికై రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆమె అంబాలా నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమార్తె ఎంపీ శృతి చౌదరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘‘మహిళలు అతితక్కువ సంఖ్యలో చట్టసభలకు ఎన్నిక కావడం విచారించాల్సిన అంశం. రాష్ట్రంలోని స్త్రీలంతా మేల్కొని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాను’’ అని శృతి పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో మహిళలకు ఒక్క సీటు కూడా కేటాయించని భాజపా సైతం ఈసారి మాజీ ఉన్నతాధికారి సునీతా దుగ్గల్‌ను సిర్సా నుంచి బరిలోకి దింపడం విశేషం.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
