close

తాజా వార్తలు

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు.. విచారణకు సుప్రీం ఓకే

 

దిల్లీ: లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరగనుంది.

ఇప్పటికే ఈ అంశంపై దేశంలోని 21 పార్టీలు కలిసి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని తీర్పునిచ్చింది. వీవీప్యాట్లలో 50% స్లిప్పులు లెక్కించడం వల్ల సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతారని, దీనివల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్షాలకు ఊరట కలిగించేలా 5 వీవీప్యాట్‌లను లెక్కించాలని నిర్ణయించినప్పటికీ గతనెలలో ప్రతిపక్షాలు దీనిపై రివ్యూ పిటిషన్‌ వేశాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.