close

తాజా వార్తలు

ముగిసిన ఐదో విడత ఎన్నికల ప్రచారం

దిల్లీ: ఈ నెల 6న జరిగే ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి ఎన్నికలకు ప్రచారం ముగిసింది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 2 స్థానాలకు ఐదో విడతలో పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న అమేఠీ, ఆయన తల్లి, యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పోటీచేస్తున్న రాయ్‌బరేలీకి ఈ విడతలోనే పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో గత నాలుగు విడతల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని 578 కంపెనీల పారామిలటరీ బలగాలను పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో మోహరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.