Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 94042
            [news_title_telugu_html] => 

ఉగ్రదాడులు పెరిగాయి: మన్మోహన్‌

[news_title_telugu] => ఉగ్రదాడులు పెరిగాయి: మన్మోహన్‌ [news_title_english] => terror attacks in Jammu and Kashmir alone have gone up by per cent [news_short_description] =>  ఎన్డీఏ ప్రభుత్వంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు.   [news_tags_keywords] => Manmohan Singh,nda,congress [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-05 22:33:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉగ్రదాడులు పెరిగాయి: మన్మోహన్‌ - terror attacks in Jammu and Kashmir alone have gone up by per cent - EENADU
close

తాజా వార్తలు

ఉగ్రదాడులు పెరిగాయి: మన్మోహన్‌

న్యూదిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ప్రభుత్వ తీరు పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. జాతీయ భద్రత విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తమ పాలనలో ఉగ్రదాడులు తగ్గాయని అంటున్నారు. ఒకే అసత్యాన్ని 100 సార్లు చెప్పినా అది నిజం కాదు. ఈ ఐదేళ్లలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు 176 శాతం పెరిగిపోయాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు 1000 రెట్లు పెరిగాయి. విభజన, ద్వేషం అనే పదాలు భాజపాకు పర్యాయ పదాలుగా మారాయి. తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఎన్డీఏ పనిచేస్తోంది. ఇటువంటి ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలి’ అని వ్యాఖ్యానించారు.

‘ఈ ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయింది. పాలనలో, జవాబుదారీతనంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అచ్చేదిన్‌ అనే హామీని ఇస్తూ ఐదేళ్ల క్రితం మోదీ అధికారంలోకి వచ్చారు. ఆయన పాలన దేశంలోని యువత, రైతులు, వ్యాపారులకు నష్టాన్ని కలిగించింది. దేశ వ్యవస్థలను నాశనం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. దీంతో దేశ భవిష్యత్తు సురక్షితంగా, భద్రతతో ఉంటుంది’ అని మన్మోహన్‌ వ్యాఖ్యానించారు.  


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.