Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 94111
            [news_title_telugu_html] => 

‘వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను విపత్తు అంటారా?’

[news_title_telugu] => ‘వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను విపత్తు అంటారా?’ [news_title_english] => Arun Jaitley targets Manmohan Singh [news_short_description] => ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మండిపడ్డారు.   [news_tags_keywords] => Arun Jaitley,Manmohan Singh [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-05 20:40:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను విపత్తు అంటారా?’ - Arun Jaitley targets Manmohan Singh - EENADU
close

తాజా వార్తలు

‘వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను విపత్తు అంటారా?’

మన్మోహన్‌ సింగ్‌పై అరుణ్‌ జైట్లీ విమర్శలు

న్యూదిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మండిపడ్డారు. మోదీ పాలనలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఓ ఆర్థిక వేత్త రాజకీయ నేతగా మారి, అటు ఆర్థిక శాస్త్రంపై ఇటు రాజకీయాలపై జ్ఞానాన్ని కోల్పోయారు. 2014కు ముందు డా.మన్మోహన్ సింగ్‌ మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మది కావడానికి కారణమయ్యారు. విధానాల్లో పక్షపాత ధోరణి, అవినీతి ఆ పాలనలో ఉండేవి. పార్లమెంటులో తమ పార్టీ (కాంగ్రెస్‌)కి ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సీట్లు ఉండే స్థితికి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వృద్ధిని ఆయన ఈ రోజు విపత్తుగా పేర్కొంటున్నారు’ అని జైట్లీ వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. 

కాగా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో పాటు మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతోందని మన్మోహన్‌ సింగ్‌ విమర్శించిన విషయం తెలిసిందే. పాలనలో, జవాబుదారీతనంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అచ్చేదిన్‌ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆయన పాలనలో యువత, రైతులు, వ్యాపారులకు కష్టాలను ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. తాము ప్రకటించిన న్యాయ్‌ పథకం ప్రజలకు న్యాయం చేస్తుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మన్మోహన్‌ తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.