close

తాజా వార్తలు

ప్రతిపక్ష భేటీకి వారు రానట్లేనా..!

మమత, మాయా, అఖిలేశ్‌ విముఖత

 

దిల్లీ: ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన విపక్షాల భేటీకి ముగ్గురు కీలక నేతలు గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మమతా బెనర్జీ, మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. గత వారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్‌కతా వెళ్లి మమతను కలిసిన సందర్భంగా ఆమె నుంచి వ్యతిరేకత ఎదురైందని తృణమూల్‌ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. మాయావతి, అఖిలేశ్‌ కూడా ఈ సమావేశంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

అయితే, ఒకవేళ ప్రతిపక్షాలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలొస్తే ప్రధానిగా ఎవరు ఉండాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే వీరు కాంగ్రెస్‌ సమావేశం పట్ల వ్యతిరేకత కనబరుస్తుండడానికి ప్రధాన కారణం.  తాము ప్రధాని పదవి ఆశిస్తున్నామని బహిరంగపర్చకపోయినా మమత, మాయావతి, రాహుల్‌ ఈ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారి పార్టీ నేతలు పలు సందర్భాల్లో తమ నేత ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హులని వ్యాఖ్యలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అయితే పార్టీల మధ్య ఐక్యత కరవైన నేపథ్యంలో ఎవరికి వారు తామే ప్రధాని పదవికి అర్హులమని భావించుకుంటుండడం వల్ల కొంత కాలం కాంగ్రెస్‌కు దూరంగా వ్యవహరించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. 

మాయావతి కాంగ్రెస్‌పై ఉన్న అసంతృప్తిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను కాదని.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో హస్తానికి మద్దతిస్తున్న మాయావతి, సందర్భాన్ని బట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. గత ఐదు నెలల నుంచి మధ్యప్రదేశ్‌లో తాను మద్దతిస్తున్న కమల్‌నాథ్‌ ప్రభుత్వంపైనా అదే స్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మెజారిటీకి రెండు సీట్లు తక్కువ సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ చర్చలు జరుపుతున్నారు. ఆయన దేశంలో భాజపా, కాంగ్రెస్‌ రహిత కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.