Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 99613
            [news_title_telugu_html] => 

ప్రపంచకప్‌ తెచ్చేది ఆ ఇద్దరే : మైకెల్‌ హోల్డింగ్‌

[news_title_telugu] => ప్రపంచకప్‌ తెచ్చేది ఆ ఇద్దరే : మైకెల్‌ హోల్డింగ్‌ [news_title_english] => Michael Holding names Indias X-factor players picks winner of WC [news_short_description] => మరో 13 రోజుల్లో ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ టోర్నీలో భాతర జట్టు కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో పాటు భారత్‌కు కూడా కప్పు గెలిచే అవకాశాలున్నాయని.... [news_tags_keywords] => ICC World Cup, Michael Holding, India, Kohli, Bumrah [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-17 17:21:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రపంచకప్‌ తెచ్చేది ఆ ఇద్దరే : మైకెల్‌ హోల్డింగ్‌ - Michael Holding names Indias X-factor players picks winner of WC - EENADU
close

తాజా వార్తలు

ప్రపంచకప్‌ తెచ్చేది ఆ ఇద్దరే : మైకెల్‌ హోల్డింగ్‌

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మరో 13 రోజుల్లో ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ టోర్నీలో భాతర జట్టు కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో పాటు భారత్‌కు కూడా కప్పు గెలిచే అవకాశాలున్నాయని పలువురు విదేశీ క్రికెట్‌ దిగ్గజాలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజం మైకెల్‌ హోల్డింగ్‌ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుత భారత జట్టుకు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే సత్తా ఉందన్నాడు. అయితే, జట్టు గెలవాలంటే ఇద్దరు ఆటగాళ్లు కీలకం అవుతారని పేర్కొన్నాడు.

‘టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. ఈ ఇద్దరూ జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్లుగా ఉపయోగపడతారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లలో కోహ్లీ, బుమ్రానే ఉత్తమ ఆటగాళ్లు. భారత్‌కు ప్రపంచకప్‌ తెచ్చిపెట్టే సత్తా వాళ్లిద్దరికి మాత్రమే ఉంది. ఇంగ్లాండ్‌ తన సొంత గడ్డపై ప్రపంచకప్‌ పోరులో దిగుతోంది. ఇటీవల వన్డేల్లోనూ ఇంగ్లాండ్‌ అద్భుతంగా ఆడుతోంది. జట్టు కూడా సమతూకంగా ఉంది. అయితే, ఇంగ్లాండ్‌కు సరైన జట్టేదైనా ఉందంటే అది కచ్చితంగా భారత జట్టే. ఈసారి ఇంగ్లాండ్‌ లేదా ఇండియా రెండింట్లో ఏ జట్టు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని హోల్డింగ్‌ పేర్కొన్నాడు.
1983 ప్రపంచకప్‌లో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మోహిందర్‌ అమర్నాథ్‌ బౌలింగ్‌లో చివరి బ్యాట్స్‌మెన్‌గా హోల్డింగ్‌ ఔటయ్యాడు. దీంతో విండీస్‌ను ఓడించిన భారత్‌ ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. కాగా మే 30 ప్రారంభం కానున్న మెగా టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.