close

తాజా వార్తలు

లఖ్‌నవూ పర్యటనకు చంద్రబాబు

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు బయల్దేరారు. సాయంత్రం 5గంటలకు బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఎన్డీయే యేతర కూటమి బలోపేతానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిన చంద్రబాబు ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. గంట పాటు సమావేశమైన సీఎం.. వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిపారు. ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు వీరి భేటీ కొనసాగింది. ఆ తర్వాత ఎల్జేడీ నేత షరద్‌ యాదవ్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్‌ రెడ్డి, డి.రాజాతో భేటీ అయిన చంద్రబాబు.. ఎన్నికల ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.