
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: చౌక అనే పదం వింటే చైనా గుర్తుకు వస్తుంది.. అలాంటిది అంతరిక్ష రంగానికి సంబంధించి మాత్రం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ అత్యంత తక్కువ ధరలోనే రోదసిలో ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్‌తోనే దీనిని నిర్వహించనుంది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ బడ్జెట్ 356 మిలియన్ డాలర్లు కాగా.. చంద్రయాన్-2 బడ్జెట్ కేవలం 232 మిలియన్ డాలర్లు మాత్రమే..!
జులైలో ప్రయోగం..
ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగ తేదీలకు సంబంధించి కొంత సమాచారాన్ని వెల్లడించింది. జులై9-16 మధ్యలో ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. సెప్టెంబర్6న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రయాన్-1కు కొనసాగింపుగా ఈ ప్రయోగం చేపట్టారు. తొలి ప్రయోగంలో భారత్ విజయం సాధించింది. ఆ పయోగంలో చంద్రుడిపై నీటిని కనుగొంది. ఇక చంద్రుడిపైకి చేరుకొన్న అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. ఇజ్రాయిల్ ఈ ఏడాది ఆరంభంలో ప్రయత్నించి విఫలమైంది.
తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి..
చంద్రయాన్-2లో భారత్ మొత్తం 13 పరికరాలను చంద్రుడి వద్దకు పంపిస్తోంది. వీటిల్లో 8 జాబిల్లి కక్ష్యలోనే ఉంటాయి.. మరో 3 ల్యాండర్లో.. మరో 2 రోవర్లో ఉంటాయి. భారత్ జీఎస్ఎల్వీ మాక్-3 రాకెట్‌ను దీనికి ఉపయోగించనుంది. ఆర్బిటర్, ల్యాండర్‌కు విక్రమ్ అని.. రోవర్‌కు ప్రజ్ఞాన్ అని పేరుపెట్టారు. ఇవి చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతాయి. ఇప్పటి వరకు ఏ దేశానికి చెందిన పరికరాలు అక్కడకి చేరుకోలేదు.
అపోలో మిషన్ కంటే కఠినం..
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా గతంలో చేపట్టిన అపోలో మిషన్ కంటే ఇది కఠినమైంది. దీనిలోని సోలార్ ప్యానల్స్ ఆధారంగా పనిచేసే రోవర్ ఉంటుంది. ఇది చంద్రుడిపై దిగే దక్షిణ ధ్రువపు ప్రాంత సమాచారాన్ని దాదాపు 14ఎర్త్డేస్ పాటు పరిశీలించి ల్యాండ్ అవుతుంది. అనంతరం అక్కడి సోడియం, మెగ్నిషియం, అల్యూమినియం, సిలికాన్ వంటి ఖనిజాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ ప్రయోగంతో భారత్ రోదసీలో తనదైన మద్రవేస్తుందని ఇస్రో వెల్లడిస్తోంది. చంద్రుడిపై చేపట్టిన ప్రయోగాల్లో దాదాపు 50శాతం మాత్రమే విజయవంతమయ్యాయి. మొత్తం 47 ప్రయోగాల్లో 27 మాత్రమే విజయవంతమయ్యాయి. భారత్ ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణను తట్టుకొనే విధంగా 25కిలోల చంద్రయాన్-2 రోవర్‌తో ప్రయోగాలు నిర్వహించింది.
తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు..
ఇస్రో తొలుత 22 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నకక్ష్యలో 3.2టన్నుల స్పేస్ క్రాఫ్ట్‌ను పంపాలని భావించింది. కానీ, ఆ తర్వాత దూరాన్ని 37వేల కిలోమీటర్లకు పెంచింది. దీనికోసం ల్యాండర్‌ను రీడిజైన్ చేశారు. ఇక ఈ ప్రయోగానికి మొత్తం 232 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 ఖరీదు జీఎస్ఎల్వీ రాకెట్లకు అయినది కాకుండా కేవలం 92 మిలియన్ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ప్రయోగంలో భారత్‌కు చెందిన ప్రైవేటు కంపెనీ, ప్రభుత్వ రంగ కంపెనీలు కీలక పాత్రను పోషించాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
