close

తాజా వార్తలు

బంగ్లా బిల్లులు కట్టని మంత్రులు

ఇంటర్నెట్‌డెస్క్‌:  కేంద్రమంత్రుల్లో చాలా మంది తాము నివసించే అధికారిక బంగ్లాలకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. ఒక ఆర్టీఐ అర్జీకి వచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మంతులు విజయ్‌గోయల్‌,  ప్రకాశ్‌ జవడేకర్‌, నిర్మలా సీతారామాన్‌, సుష్మా స్వరాజ్‌ వంటి వారు కూడా బకాయిలు చెల్లించలేదని దీనిలో పేర్కొన్నారు. ఈ బకాయిలు అన్నీ బంగ్లాల్లో ఫర్నిచర్‌ , ఇతర సౌకర్యాలకు సంబంధించి చెల్లించాల్సినవి. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే డైరెక్టరేట్‌ ఆఫ్ ఎస్టేట్‌ ఈ విషయాలను చూస్తుంది. 
* కేంద్ర మంత్రులు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ  రూ.1.46లక్షలు చెల్లించాలి. జితేంద్ర సింగ్‌ రూ.3.18లక్షలు చెల్లించాల్సి ఉంది. 
* ఫిబ్రవరి నాటికి కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.53,276, జవడేవకర్‌ రూ.86,923 చెల్లించాల్సి ఉంది. 
* కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ రూ.3లక్షలు, మరో మంత్రి గజేంద్ర సింగ్‌ 2,88,269 చెల్లించాల్సి ఉంది. విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్‌ రూ.98,890 బకాయి ఉన్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.