close

తాజా వార్తలు

కాసేపట్లో ఎగ్జిట్‌ పోల్స్‌.. సర్వత్రా ఉత్కంఠ!

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేటితో పరిసమాప్తమైంది. ఏడో దశ పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాల తరువాయి. అయితే ఈ నేపథ్యంలో మరికాసేపట్లో వెల్లడి కానున్న ఎగ్జిట్‌ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 542 లోక్‌ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌లో  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణల్ని ఆయా సర్వే సంస్థలు వెల్లడించనున్నాయి. 

అలాగే, ఇప్పటికే ఏపీలో ప్రజలు సైకిల్‌ వైపే నిలిచారంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన వ్యక్తిగతమైన అంచనాలు నిన్న వెల్లడించినప్పటికీ.. ఆ సంస్థ శాస్త్రీయంగా జరిపిన సర్వే వివరాలను సాయంత్రం 6గంటలకు తిరుపతి వేదికగా ప్రకటించనున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.