Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100924
            [news_title_telugu_html] => 

‘దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తాం’

[news_title_telugu] => ‘దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తాం’ [news_title_english] => Dare not try and come anywhere near LoC Indian Army to Pakistan [news_short_description] => పాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తామని భారత ఆర్మీ ఉత్తర కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్ రణ్‌బీర్‌ సింగ్ తెలిపారు.   [news_tags_keywords] => pakistan,india,army [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-20 14:49:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తాం’ - Dare not try and come anywhere near LoC Indian Army to Pakistan - EENADU
close

తాజా వార్తలు

‘దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తాం’

పాక్‌కు భారత ఆర్మీ హెచ్చరిక

శ్రీనగర్‌ (జమ్ముకశ్మీర్‌): పాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తామని భారత ఆర్మీ ఉత్తర కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్ రణ్‌బీర్‌ సింగ్ హెచ్చరించారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్‌లోని బాలాకోట్‌లో భారత్‌ నిర్వహించిన దాడులను కొనియాడారు. ‘పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత వైమానిక దళాలు చేసిన దాడులు ప్రశంసనీయం. ఇది చాలా గొప్ప విజయం.. పాక్‌ భూభాగంలో చాలా లోపలికి వెళ్లి ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించారు. ఆ తదుపరి రోజే.. నియంత్రణ రేఖ వద్ద పాక్‌ వైమానిక దళ ఆపరేషన్లను మొదలు పెట్టింది. అయినప్పటికీ వారికి గట్టిగా బుద్ధి చెప్పాం’ అని వ్యాఖ్యానించారు. ‌  

‘నియంత్రణ రేఖల వద్దకు వచ్చి దుశ్చర్యలకు పాల్పడే ధైర్యం పాక్‌ చేయొద్దు. భారత మిలిటరీ వ్యూహాలన్నీ పూర్తిగా స్పష్టంగా ఉన్నాయి. పాక్‌ భద్రతా బలగాలు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బదులిస్తాం. పాకిస్థాన్‌ నుంచి ఎదురయ్యే ఎటువంటి సవాళ్లనయినా ఎదుర్కొనేందుకు, ఆపరేషన్‌ ప్రణాళికలను సమర్థవంతంగా నిర్వహించడానికి భారత ఆర్మీ పూర్తిగా శక్తిమంతంగా ఉందని నేను భరోసా ఇస్తున్నాను. జమ్ముకశ్మీర్‌లో భద్రత పూర్తిగా నియంత్రణలో ఉంది. పాకిస్థాన్‌.. భారత వ్యతిరేక చర్యలను కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్లు, కాల్పుల విరమణ ఉల్లంఘనలు, డ్రగ్స్‌ అక్రమ రవాణ, నకిలీ కరెన్సీ చలామణి వంటి చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్‌లో ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.  


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.