close

తాజా వార్తలు

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు: ప్రియాంక  

దిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకే తిరిగి అధికారం కట్టబెట్టడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా నిరాశ నిస్పృహలకు లోనుకావొద్దని.. కేవలం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో భయాందోళనలు నెలకొల్పడం కోసమే భాజపా ఇలాంటి ప్రచారాలకు తెరలేపిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె కార్యకర్తలకు ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. అలాగే స్ట్రాంగ్‌ రూంలపై ఓ కన్నేసి ఉంచాలని కూడా ఆమె కార్యకర్తలను కోరారు. ‘‘ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలో కార్యకర్తలెవరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టాలనే.. ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కౌంటింగ్‌ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వైపు నిఘా ఉంచండి. మన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం నాకుంది’’ అని కార్యకర్తలకిచ్చిన సందేశంలో ప్రియాంక పేర్కొన్నారు.

సార్వత్రిక సమరంలో భాగంగా ఏడు విడతల ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో దాదాపు అన్ని సంస్థలు అధికార ఎన్డీయేకే మెజార్టీ రానుందని తీర్పిచ్చాయి. మరోసారి కాంగ్రెస్‌ ప్రతిపక్షానికే పరిమితం కానుందన్న అంచనాలు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశలో ముంచెత్తాయి. మరోవైపు ఎలాగైనా భాజపాను అధికారాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పలువురు నాయకులు ఇతర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా భాజపాయేతర పక్షాలన్నీ దిల్లీలో సమావేశమై ఎన్నికల అనంతరం అనుసరించాల్సిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.