
తాజా వార్తలు
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ప్రసారభారతి అన్ని ఏర్పాట్లు చేసింది. గూగుల్‌తో కలిసి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను యూట్యూబ్‌లో నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రసారభారతి అధికారులు వెల్లడించారు.
‘యూట్యూబ్ వెబ్సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే టాప్ స్క్రీన్‌లో డీడీ న్యూస్ స్ట్రీమ్ కన్పిస్తుంది. అందులో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఆ స్ట్రీమ్‌ను క్లిక్ చేస్తే డీడీన్యూస్ లైవ్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దీంతో పాటు 14 ప్రాంతీయ భాషాల్లోని డీడీ లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్స్ కన్పిస్తాయి. యూజర్లు తమకు నచ్చినదాన్ని ఎంచుకుని ఎన్నికల ఫలితాలను ప్రత్యక ప్రసారంలో చూడొచ్చు’ అని ప్రసారభారతి అధికారులు తెలిపారు.
సాధారణంగా కౌంటింగ్ మొదలైన 2-3 గంటల్లో ఒక్కో మీడియాలో ఒక్కో రకంగా వార్తలు వస్తుంటాయి. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతుంటారు. అయితే డీడీ ప్రత్యక్ష ప్రసారంతో కచ్చితమైన ఫలితాలను ప్రజలు తెలుసుకోగలుగుతారని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ప్రసారభారతి తొలిసారిగా గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- ఫ్యాన్ మృతిపట్ల చెర్రీ ఆవేదన..వీడియో వైరల్
- రేషన్ జాబితా నుంచి వారిని తొలగించొద్దు
- నాగేశ్వరరావు న్యాయం చేయలేడన్నారు!
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- వాహనాల విక్రయాలు.. మళ్లీ తగ్గాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
