close

తాజా వార్తలు

‘ఏదేమైనా నేను మీ వెంటే..’

ప్రియాంక, రాహుల్‌ను ఉద్దేశిస్తూ వాద్రా

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో తన భార్య ప్రియాంక గాంధీని, బావ రాహుల్‌ను ఉద్దేశిస్తూ రాబర్ట్‌ వాద్రా ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. వారిరువురినీ ‘R’ (రాహుల్‌), ‘P’ (ప్రియాంక) అని సంబోధిస్తూ.. ‘ఆల్‌ ది బెస్ట్‌. ఏదేమైనా నేను మీ వెంటే ఉంటాను. గుడ్‌ లక్‌’ అని పేర్కొన్నారు. రాహుల్‌, ప్రియాంకలతో కలిసి దిగిన ఫొటోలను కూడా పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు కూడా విషెస్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడైన రాహుల్‌ ఈ ఎన్నికల్లో వాయనాడ్‌, అమేఠీ నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.