close

తాజా వార్తలు

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కమలం జోరు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి జోరు మీదుంది. ఇప్పటికే మెజార్టీకి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సైతం కమలం హవా కొనసాగుతోంది. 

చత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలుండగా.. భాజపా 9 చోట్ల ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 29 నియోజకవర్గాలుండగా.. 20 చోట్ల ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ కేవలం 9 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలుండగా.. 23 చోట్ల భాజపా ముందంజలో కొనసాగుతోంది. గతేడాది ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అక్కడ కూడా భాజపానే ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో 28 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. భాజపా 23 చోట్ల ముందంజలో సాగుతోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. మండ్యలో స్వతంత్ర అభ్యర్థి సుమలత ముందంజలో కొనసాగుతున్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.