
తాజా వార్తలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పలు జిల్లాల్లో జగన్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయంలో జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యాలను పరిశీలిస్తే..
* అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వైకాపా 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార తెదేపా 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
* చిత్తూరుజిల్లాలో 14 నియోజకవర్గాలకు గానూ.. వైకాపా 11, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
* తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైకాపా 15, తెదేపా 4 చోట్ల ముందంజలో ఉన్నాయి.
* గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గానూ.. వైకాపా 12, తెదేపా 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
* కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ వైకాపానే ముందంజలో ఉంది.
* కృష్ణా జిల్లాలో 16 స్థానాలుండగా.. 12 చోట్ల వైకాపా, 4 చోట్ల తెదేపా ఆధిక్యంలో ఉన్నాయి.
* కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. వైకాపా 13, తెదేపా ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతున్నాయి.
* నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ వైకాపానే ముందంజలో ఉంది.
* ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా.. వైకాపా 9 చోట్ల, తెదేపా 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గానూ.. 9 స్థానాల్లో వైకాపా, ఒక స్థానంలో తెదేపా ముందంజలో ఉన్నాయి.
* విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా.. వైకాపా 11, తెదేపా 3 చోట్ల, జనసేన ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
* విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉంది.
* పశ్చిమగోదావరిలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వైకాపా 12 చోట్ల, తెదేపా 3 చోట్ల ముందంజలో కొనసాగుతున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
