Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102354
            [news_title_telugu_html] => 

నెహ్రూ, ఇందిరా తర్వాత మోదీదే ఆ రికార్డు..

[news_title_telugu] => నెహ్రూ, ఇందిరా తర్వాత మోదీదే ఆ రికార్డు.. [news_title_english] => After Nehru and Indira Modi is only PM to come back to power with full majority [news_short_description] => మాజీ ప్రధానులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత లోక్‌సభలో పూర్తి మెజార్టీతో.. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు.... [news_tags_keywords] => NULL [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 01:47:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నెహ్రూ, ఇందిరా తర్వాత మోదీదే ఆ రికార్డు.. - After Nehru and Indira Modi is only PM to come back to power with full majority - EENADU
close

తాజా వార్తలు

నెహ్రూ, ఇందిరా తర్వాత మోదీదే ఆ రికార్డు..

న్యూదిల్లీ: మాజీ ప్రధానులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత లోక్‌సభలో పూర్తి మెజార్టీతో.. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. కొనసాగుతున్న ఫలితాల ట్రెండ్స్‌ను బట్టి చూస్తే.. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో భాజపా 272 మార్కును తేలికగా దాటనున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో 543 స్థానాలకు పోలింగ్‌ జరగగా భాజపా 282 స్థానాల్లో విజయం సాధించింది.     

1951-52లో మొదటి లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాలుగింట మూడు వంతుల సీట్లను జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ సాధించింది. అలాగే, 1957, 1962ల్లో జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి మెజార్టీతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1951-52 ఎన్నికల్లో 489 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ 364 సీట్లు గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మినహాయిస్తే మిగిలిన రెండు పార్టీలకు మాత్రమే రెండంకెల సీట్లు వచ్చాయి. 1957లో 494 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్‌కి 371 సీట్లు దక్కాయి. 1962లో 494 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్‌కి 361 దక్కాయి.    

1967లో 520 స్థానాలకు ఎన్నికలు జరగగా నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ 283 సీట్లను సాధించింది. ఇందిరా గాంధీని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో (1969లో) 518 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆమె ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ (ఓ) 352 సీట్లు గెలిచి, పూర్తి మెజార్టీతో విజయం సాధించింది.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ-2లో అవినీతి, కుంభకోణాల ఫలితం ప్రభావంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భాజపా 282 సీట్లను సాధించింది. ఈ సారి కూడా భాజపాకు మెజార్టీ సీట్లు ఖాయం అవుతుండడంతో.. పూర్తి మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ప్రధానిగా మోదీ నిలుస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.