close

తాజా వార్తలు

టిక్‌టాక్‌లో ఆకట్టుకుంటున్న మోదీ ‘విజయ గీతాలు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకునే నాయకుల్లో ప్రధాని మోదీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సందర్భాన్నీ వదలకుండా ప్రజలకు చేరువకావడాన్ని ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్ని ఏ స్థాయిలో వాడుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం సమయంలో అయితే ప్రతిరోజు ఏదో ఒక సందేశంతో ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేస్తారు. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో సామాజిక మాధ్యమాల వినియోగం మోదీ కేంద్ర రాజకీయాల్లోకి వచ్చిన తరవాతే ఊపందుకుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2014, 2019లో  ఈ సాధనం ఆయన గెలుపునకు ఎంతగానో ఉపయోగపడింది.
 

అయితే మోదీయే కాదు ఆయన అభిమానులు కూడా సామాజిక  మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ గెలుపు దాదాపు ఖాయమని భావించిన ఆయన అభిమానులు ఉదయం నుంచే వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌లో ఆయనకు మద్దతుగా అనేక వీడియోలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఆయన గెలుపును ప్రశంసిస్తూ వివిధ రకాల వీడియోలను రూపొందించి షేర్‌ చేశారు. వాటికి వారి అభినయం, 90లనాటి పాటలు తోడుకావడంతో ప్రస్తుతం అవి టిక్‌టాక్‌ను ఊపేస్తున్నాయి. అనేక నినాదాలు, పాటలు మోదీకి విజయానికి అనుగుణంగా మలచి చేసిన వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వీలైతే మీ ఫోన్‌లో ఉన్న టిక్‌టాక్‌ యాప్‌లో ఓ లుక్కేయండి!


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.