close

తాజా వార్తలు

వారి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

గాంధీనగర్: ఓటర్లు వివిధ పార్టీల మీద మక్కువ చూపినట్లే నోటా గుర్తు మీద కొందరు ఓటర్లు అభిమానం చాటుకున్నారు. కొన్ని చోట్ల బరిలో నిలిచిన అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకు పోలైన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం వెల్లడైన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలుస్తున్నాయి. తాము ఓటేయడానికి ఏ అభ్యర్థి సరైన వ్యక్తి కాదని తేల్చుకున్నప్పుడు ఓటరు ఈవీఎంలోని నోటా(పైవేవి కాదు) గుర్తును ఎంచుకుంటాడు. అయితే గుజరాత్‌లోని ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీకి నిలిచిన అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

స్థానిక గిరిజనుల గళాన్ని వినిపించాలన్న ఉద్దేశంతో భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. రెండు సంవత్సరాల క్రితం గిరిజన నాయకుడు ఛోటు వాసవ ఈ పార్టీని స్థాపించారు. వాసవ, ఆయన కుమారుడు మహేశ్ వాసవ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.  గత సంవత్సరం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 11 మందిని బరిలోకి దింపిన బీటీపీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వల్సాద్, బార్డోలీ, ఛోటా ఉదేపూర్ ప్రాంతాల్లో పోటీచేసిన అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువగా వచ్చాయని ఎన్నికల సంఘం అందించిన సమాచారం ఆధారంగా వెల్లడవుతోంది. వల్సాద్ అభ్యర్థికి 9,536 ఓట్లు రాగా, నోటాకు 10,307 ఓట్లు వచ్చాయి. అలాగే ఛోటా ఉదేపూర్‌ అభ్యర్థి 10,632 ఓట్లు దక్కించుకోగా, నోటా ఖాతాలో 32,868 ఓట్లు చేరాయి. బార్డోలీ అభ్యర్థికి 11,781 ఓట్లు, నోటాకు 22,914 ఓట్లు దక్కాయి.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.