close

తాజా వార్తలు

అమ్మో..! కోహ్లీ మనిషి కాడు: లారా

ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మనిషి కాదని అతడో యంత్రమని దిగ్గజ క్రికెటర్‌ బ్రయాన్‌ లారా అన్నాడు. అతడి ఫిట్‌నెస్‌ అమోఘమని ప్రశంసించాడు. సారథిగా తొలిసారి కోహ్లీ టీమిండియాను ప్రపంచకప్‌లో నడిపిస్తున్న సంగతి తెలిసిందే. 

‘అతడో యంత్రం. 80, 90ల నాటి ఆటగాళ్లతో పోలిస్తే కోహ్లీ ఓ విభిన్న క్రికెటర్‌. దృఢంగా ఉండటం ఎప్పటికీ అవసరమే. మేం ఆడుతున్న సమయంలో మాత్రం ఇంత ప్రాముఖ్యం లేదు. ఎక్కువ క్రికెట్‌ ఆడాలంటే మరింత దృఢంగా ఉండాలి. కోహ్లీ ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతాడు. ఫిట్‌నెస్‌పై నిరంతరం పనిచేస్తాడు. అందుకే అతడు పరుగుల యంత్రం’ అని లారా కొనియాడాడు. 

‘ఒక ఆటగాడు ఆడిన ప్రతిసారీ పరుగులు చేయడమంటే మామూలు విషయం కాదు. సచిన్‌, నేను దిగ్గజ ఆటగాళ్లం. అతడి వారసత్వాన్ని విరాట్‌ పుణికిపుచ్చుకున్నాడు. వారిద్దరినీ నేను పోల్చకూడదు. కానీ కోహ్లీలో ఓ ప్రత్యేక ప్రతిభ ఉంది. యువ క్రికెటర్లకు అతడో స్ఫూర్తి. టీమిండియాలో జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన పేసర్‌. నేను అతడిని ఎదుర్కొంటే మాత్రం పరుగులు చేసేందుకే ప్రయత్నిస్తా (నవ్వులు). అతడి యాక్షన్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తికమక పెడుతోంది. నేనైతే అతడి బౌలింగ్‌లో స్ట్రైక్‌ రొటేట్‌ చేసి ఒత్తిడి పెంచుతా. అతడిపై ఎదురుదాడికి దిగడం తెలివైన పని కాదు. అతడికీ చెడ్డ రోజులు ఉంటాయి. ఆ సమయాన్ని బ్యాట్స్‌మెన్‌ అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతానికి అతడికి ఆ పరిస్థితి లేదు’ అని లారా వెల్లడించాడు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.