Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102845
            [news_title_telugu_html] => 

కోహ్లీకి అవసరమైనప్పుడల్లా నేనుంటా:రోహిత్‌శర్మ

[news_title_telugu] => కోహ్లీకి అవసరమైనప్పుడల్లా నేనుంటా:రోహిత్‌శర్మ [news_title_english] => Rohit sharma says virat has done well so far as Captain [news_short_description] => భారత్‌లో ఇప్పటివరకూ అందరి దృష్టి ఎన్నికల మీద ఉండగా నిన్న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరంతా ప్రపంచకప్‌పై వైపు మళ్లే సమయం ఆసన్నమైంది. మరో ఆరు రోజుల్లో క్రికెట్‌ మెగా... [news_tags_keywords] => Cricket,Virat Kohli,Rohit Sharma,Team India,World Cup 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 22:28:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోహ్లీకి అవసరమైనప్పుడల్లా నేనుంటా:రోహిత్‌శర్మ - Rohit sharma says virat has done well so far as Captain - EENADU
close

తాజా వార్తలు

కోహ్లీకి అవసరమైనప్పుడల్లా నేనుంటా:రోహిత్‌శర్మ

న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచుకు సన్నద్ధం

లండన్‌: భారత్‌లో ఇప్పటివరకూ అందరి దృష్టి ఎన్నికల మీద ఉండగా నిన్న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరంతా ప్రపంచకప్‌పై వైపు మళ్లే సమయం ఆసన్నమైంది. మరో ఆరు రోజుల్లో క్రికెట్‌ మెగా ఈవెంట్‌ 12వ వన్డే ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా శనివారం న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సిఉంది. కాగా టీమ్‌ ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఓ మీడియాతో ముచ్చటిస్తూ కోహ్లీ సారథ్యం, జట్టు సమతుల్యంపై స్పందించాడు. 

ఆయన మాట్లాడుతూ.. భారత జట్టు సారథిగా విరాట్‌కోహ్లీ గతకొన్నేళ్లుగా బాగా రాణిస్తున్నాడని, అతడికి ఈసారి మంచి జట్టు లభించిందని చెప్పాడు. అలాగే కోహ్లీకి అవసరమైనప్పుడల్లా తాను తోడుగా ఉండి, తన బాధ్యతని సమర్థవంతంగా పూర్తిచేస్తానని పేర్కొన్నాడు. అలా ఆడటం తనకెంతో సంతోషమని, అన్నిటికన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపాడు. తనని ఏది చెయ్యమన్నా సంతోషంగా చేస్తానని రోహిత్‌ స్పష్టంచేశాడు.

టాప్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ బాధ్యత గురించి స్పందిస్తూ.. శిఖర్‌ధావన్‌, విరాట్‌కోహ్లీతో పాటు తను కూడా బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. వీలైనంత వరకూ తామే నిలకడగా కొనసాగుతూ బాగా రాణించాలన్నాడు. అయితే నిన్న నేనాడాను, ఈరోజు నువ్వు ఆడాలి అనే పద్ధతిలో కాకుండా ముగ్గురం బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. 

అలాగే భారత్‌ బౌలింగ్‌ ఎటాక్‌ బాగుందని, మరే ఇతర జట్టుకూ ఇంతటి బలమైన బౌలింగ్‌ లైనప్‌ లేదన్నాడు. విరాట్‌కు కావాల్సినన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఫుల్‌టైమ్‌ స్పిన్నర్లు, ఆఫ్‌టైమ్‌ స్పిన్నర్లతో పాటు మీడియం పేస్‌ బౌలింగ్‌, లెఫ్టార్మ్‌ బౌలింగ్‌ వంటి వైవిధ్యమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మే 25న న్యూజిలాండ్‌, 28న బంగ్లదేశ్‌ జట్లతో భారత్‌ వార్మప్‌ మ్యాచులు ఆడనుంది. జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.