Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103780
            [news_title_telugu_html] => 

అరుణ్‌ జైట్లీపై వస్తున్న వార్తలు అవాస్తవం

[news_title_telugu] => అరుణ్‌ జైట్లీపై వస్తున్న వార్తలు అవాస్తవం [news_title_english] => Fake News deteriorating health of Arun Jaitley is false and baseless clears Government [news_short_description] => తాజా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జైట్లీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందన్న కథనాలు నిరాధారమైనవని తెలిపింది. [news_tags_keywords] => Arun Jaitley, Finance Minister, Ill Health, Fake news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => | https://www.youtube.com/embed/2GiXOSRG524 [news_videoinfo] => | https://www.youtube.com/embed/2GiXOSRG524 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-27 00:50:25 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అరుణ్‌ జైట్లీపై వస్తున్న వార్తలు అవాస్తవం - Fake News deteriorating health of Arun Jaitley is false and baseless clears Government - EENADU
close

తాజా వార్తలు

అరుణ్‌ జైట్లీపై వస్తున్న వార్తలు అవాస్తవం

స్పష్టం చేసిన ప్రభుత్వం

దిల్లీ: తాజా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జైట్లీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందన్న కథనాలు నిరాధారమైనవని తెలిపింది. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. జైట్లీ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న తరుణంలో ప్రభుత్వ అధికార ప్రతినిధి సితాన్షుకర్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టతనిచ్చారు. 
‘‘కొన్ని ప్రసార మాధ్యమాల్లో అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం గురించి వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవాలు, నిరాధారమైనవి. ఈ ఊహాగానాలపై మీడియా సంయమనం పాటించాలి’’ అని ట్వీట్‌ చేశారు. గతంలో జైట్లీని సంప్రదించాలని కొందరు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని జైట్లీ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో ఇక జైట్లీ రెండో దఫా ఆర్థిక మంత్రిగా కొనసాగే అవకాశం లేదని, చికిత్స కోసం యూకే లేదా అమెరికా వెళ్తారని మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి.
అరుణ్‌ జైట్లీ కాలేజీ స్నేహితుడు, మీడియా దిగ్గజం రజత్‌ శర్మ కూడా ఆయన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్విటర్‌ ద్వారా ఖండించారు. బయటికి వస్తే ఇన్ఫెక్షన్‌ సోకుతుందని జైట్లీ ఇంటికే పరిమితమయ్యారని, ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని వివరించారు. అరుణ్‌ జైట్లీ గత వారమే దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినప్పటికీ ఆయన అనారోగ్యానికి సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయానంతరం జరుపుకొన్న ఏ ఉత్సవంలోనూ అరుణ్‌ జైట్లీ పాల్గొనని సంగతి తెలిసిందే.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.