Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103795
            [news_title_telugu_html] => 

రాజీవ్‌కుమార్‌కు సీబీఐ నోటీసులు

[news_title_telugu] => రాజీవ్‌కుమార్‌కు సీబీఐ నోటీసులు [news_title_english] => Rajeev kumar to appear before cbi on Monday [news_short_description] => శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది. సోమవారం [news_tags_keywords] => Rajeev Kumar,West Bengal,Sharada Chitfund Scam [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/-9yKmsJ2rSs [news_videoinfo] => |https://www.youtube.com/embed/-9yKmsJ2rSs [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-27 00:49:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజీవ్‌కుమార్‌కు సీబీఐ నోటీసులు - Rajeev kumar to appear before cbi on Monday - EENADU
close

తాజా వార్తలు

రాజీవ్‌కుమార్‌కు సీబీఐ నోటీసులు

కోల్‌కతా: శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా కోరింది. ఆయనపై ఆదివారం ఉదయం సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏడాది పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. రాజీవ్‌కుమార్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన అనంతరం ఆదివారం రాత్రి కొంత మంది సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ అందుబాటులో లేరు. కోల్‌కతా సిటీ పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో రాజీవ్‌ ఇక్కడ ఉండేవారని.. ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉండడం లేదంటూ ఆ నివాసం వద్ద డ్యూటీలో ఉన్న గార్డ్సు తెలిపారు. దీంతో వెంటనే వారు కోల్‌కతా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ ‌పోలీస్‌ కార్యాలయానికి వెళ్లి రాజీవ్‌ కుమార్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై ఇటీవల సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తునకు రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని, అంతేగాక సాక్ష్యాలను మరుగుపర్చేందుకు చూస్తున్నారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాజీవ్‌ కుమార్‌ విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో అమిత్‌ షా నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాజీవ్‌ కుమార్‌ను ప్రభుత్వం.. బెంగాల్‌ సీఐడీ ఏడీజీగా తొలగించింది. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.