
తాజా వార్తలు
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన ప్రతిపక్ష పార్టీలన్నీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి. ఈ మేరకు మే 31న పార్టీలన్నీ పార్లమెంటు హాలులో సమావేశం కానున్నాయి. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు అంతర్గత సమావేశాలు నిర్వహించి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నాయి. ఓటమిపై ఈసారి ఉమ్మడిగా చర్చించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్షాలు భేటీ కావడం ఇదే తొలిసారి.
ఎన్నికల్లో ఈవీఎం ఓట్లకు వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం వచ్చిందన్న ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జూన్ 6న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయన్న వార్తల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మరుసటి రోజే ఈ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది. అలాగే జూన్ 1న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతను ఎన్నుకోనున్నారు. అలాగే తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. రాహుల్ రాజీనామా అనంతరం జరగనున్న తొలి సమావేశం ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
