Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 107208
            [news_title_telugu_html] => 

జనాభా నియంత్రణ చట్టం కోసం ఉద్యమించండి

[news_title_telugu] => జనాభా నియంత్రణ చట్టం కోసం ఉద్యమించండి [news_title_english] => giriraj singh asks people to make population control [news_short_description] => జనాభా నియంత్రణ చట్టం కోసం ప్రజలందరూ ఉద్యమించాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్ కోరారు. జనాభా నియంత్రణను పాటిస్తే భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ఇప్పటి నుంచే అదుపులోకి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. [news_tags_keywords] => giriraj singh,population [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-03 23:10:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జనాభా నియంత్రణ చట్టం కోసం ఉద్యమించండి - giriraj singh asks people to make population control - EENADU
close

తాజా వార్తలు

జనాభా నియంత్రణ చట్టం కోసం ఉద్యమించండి

ప్రజలను కోరిన ఉద్దేశించి కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌

దిల్లీ: జనాభా నియంత్రణ చట్టం కోసం ప్రజలే ఉద్యమించాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్ కోరారు. జనాభా నియంత్రణను పాటిస్తే భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ఇప్పటి నుంచే అదుపులోకి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

‘భారత అభివృద్ధికి జనాభా పెరుగుదల విఘాతం కలిగిస్తోంది. కాబట్టి జనాభా నియంత్రణ చట్టం కోసం ప్రజలందరూ ఉద్యమించాలి. వీధుల నుంచి పార్లమెంటు వరకు ఈ ఉద్యమాన్ని తీసుకురావాలి. జనాభా పెరుగుదల ఇటు కుటుంబానికి, అటు సమాజానికి ఎంతో నష్టం. వచ్చే 50 ఏళ్లలో భారత జనాభా 150 కోట్లకు మించకూడదు. అంతకంటే భరించడం భారతావనికి కష్టమవుతుంది. అందుకే మూడో సంతానానికి ప్రజలు దూరంగా ఉండాలి. వారికి ఓటు హక్కు కూడా ఉండకూదని, ఈ విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. కొత్తగా తీసుకురాబోయే చట్టం ప్రకారం మూడో సంతానానికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ప్రయోజనాలు వారికి అందకుండా ఉండేలా చూడమని కొందరు చెబుతున్నారు. కాబట్టి జనాభా నియంత్రణ చట్టానికి ప్రజలు కూడా సహకరించాలి. సమయం, వనరులు చాలా తక్కువగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

జనాభా నియంత్రణ విషయమై కొద్ది రోజుల క్రితం రామ్‌దేవ్‌ బాబా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మూడో సంతానానికి ఓటు హక్కు ఉండకూదని అన్నారు. ఐరాస తెలిపిన నివేదికల ప్రకారం 2017లో భారత జనాభా 1.3బిలియన్లు. 2024 నాటకి చైనాను భారత్‌ అధిగమిస్తుందని ఐరాస పేర్కొంది.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.