close

తాజా వార్తలు

రిటైర్మెంట్‌కు ముందు రోజు ఉద్యోగం ఫట్‌!

గుజరాత్‌ ఐపీఎస్‌ అధికారికి భిన్న అనుభవం

అహ్మదాబాద్‌: గుజరాత్‌కు చెందిన ఐపీఎస్‌కు అధికారికి భిన్న అనుభవం ఎదురైంది. ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగికి రావాల్సిన ప్రయోజనాలకు ఆయన దూరమయ్యారు.

బిల్కిస్‌ బానో కేసులో నిందితుడిగా ఉన్న గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌ ఎస్‌ భగోరా ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. 30న ఆయనను విధుల నుంచి తప్పించాలని కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గుజరాత్‌ హోంశాఖ డిప్యూటీ సెక్రటరీ ఎంఆర్‌ సోనీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో అనే మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భవతి. ఆమె కుటుంబానికి చెందిన 14 మంది కూడా ఆ అల్లర్లలో చనిపోయారు. ఆమె రెండున్నరేళ్ల పాప కూడా హత్యకు గురైంది. తనకు జరిగిన అన్యాయంపై సుదీర్ఘంగా పోరాడిన.. బిల్కిస్‌ బానోకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు జరిగిన అన్యాయానికి గానూ రూ.50 లక్షల నగదు, ఉద్యోగం, వసతి సదుపాయాలు కల్పించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నాటి ఘటనలో భగోరాతో పాటు పలువురు పోలీసు అధికారులను బొంబాయి హైకోర్టు దోషులుగా తేల్చింది. ఈ తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు..  వీరిపై చర్యలకు ఈ ఏడాది మార్చిలో ఆదేశించింది. రాష్ట్ర పోలీసు అధికారిగా సేవలందించిన భగోరా.. 2006లో గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌గా ప్రమోషన్‌ పొందారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.