close

తాజా వార్తలు

విఫలమైన బస్సు బ్రేకులు.. 9 మంది మృతి 

గాంధీనగర్‌: గుజరాత్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అంబాజీలోని త్రిసూలియా ఘాట్‌ నుంచి శుక్రవారం ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బ్రేకులు విఫలం కావడంతో అది అక్కడి ఓ రాయిని ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.